ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంటూరు అఖిలపక్షం ఆధ్వర్యంలో నేడు ఆందోళనలు - గుంటూరు అఖిలపక్షం భేటీ న్యూస్

అమరావతిలోనే రాజధాని కొనసాగించాలంటూ గుంటూరు అఖిలపక్షం ఆధ్వర్యంలో ఇవాళ ఆందోళనలు నిర్వహించనున్నారు. ఈనెల 27న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో జీఎన్ రావు కమిటీ నివేదికపై చర్చించనుండటంతో.. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

gunturu all party protest tomorrow
gunturu all party protest tomorrow

By

Published : Dec 25, 2019, 8:56 PM IST

Updated : Dec 26, 2019, 5:11 AM IST

నేడు గుంటూరు అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళనలు

గుంటూరు అఖిలపక్షం ఆధ్వర్యంలో నేడు ఆందోళన కార్యక్రమాలు జరగనున్నాయి. గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులకు అఖిలపక్షం తరఫున వినతిపత్రాలు అందజేయనున్నారు. గుంటూరులోని హోంమంత్రి మేకతోటి సుచరిత, ఉండవల్లిలోని మోపిదేవి వెంకటరమణరావు ఇళ్లకు వెళ్లి.. రాజధానిని అమరావతిలోనే ఉంచే విధంగా మంత్రివర్గంలో చర్చించాలని విజ్ఞప్తి చేయనున్నారు. అలాగే జిల్లావ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ ఆందోళనల్లో తెలుగుదేశం పార్టీతోపాటు జనసేన, సీపీఐ, ఆప్, ప్రజా సంఘాలు పాల్గొననున్నాయి.

Last Updated : Dec 26, 2019, 5:11 AM IST

ABOUT THE AUTHOR

...view details