గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్‌రావుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. గత రెండు మూడ్రోజులుగా పేదలందరికి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే.. శనివారం జ్వరం రావడంతో వైద్యులను సంప్రదించారు. డాక్టర్ల సూచన మేరకు కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అనంతరం ఆయన కార్యాలయంలోని సిబ్బంది, ఆయనతో ఉన్న సహచరులు కరోనా పరీక్షలు చేయించుకోగా వారికి నెగిటివ్‌గా నిర్ధారణ అయ్యినట్లు తెలిసింది. గత రెండు రోజులుగా తనను కలిసిన వారంతా కొవిడ్ పరీక్షలు చేసుకోవాలని ఆయన సూచించారు.
గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గిరిధర్‌రావుకు కరోనా పాజిటివ్ - గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే తాజా వార్తలు
గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్‌రావుకు కరోనా సోకింది. ఆయన రెండు మూడ్రోజులుగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వల్ప జ్వరం రావడంతో ఆయన శనివారం కరోనా పరీక్షలు చేయించుకున్నారు. తనను కలిసిన వారంతా కొవిడ్ పరీక్షలు చేసుకోవాలని అన్నారు.
ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్‌రావుకు కరోనా పాజిటీవ్