ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా జయించిన పోలీసు వీరులకు ఎస్పీ ఘన స్వాగతం - corona updates at corona

గుంటూరు అర్బన్ పరిధిలో కరోనా జయించిన ఏడుగురు పోలీస్ వీరులకు ఎస్పీ అమ్మిరెడ్డి ఘన స్వాగతం పలికారు. డ్రై ఫ్రూట్స్ అందించి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. గుంటూరు అర్బన్ పరిధిలో 40మంది పోలీసు సిబ్బందికి కరోనా సోకినట్లు ఎస్పీ తెలిపారు.

కరోనా జయించిన పోలీస్ వీరులకు ఎస్పీ ఘన స్వాగతం
కరోనా జయించిన పోలీస్ వీరులకు ఎస్పీ ఘన స్వాగతం

By

Published : Jul 18, 2020, 3:59 PM IST

గుంటూరు అర్బన్ పరిధిలో 40మంది పోలీసు సిబ్బందికి కరోనా సోకినట్లు ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు. కోవిడ్ నుంచి కోలుకుని తిరిగి విధుల్లో చేరేందుకు వచ్చిన ఏడుగురు పోలీసులకు ఆయన తన సిబ్బందితో కలిసి స్వాగతం పలికారు. కరోనాను జయించి మళ్లీ విధుల్లో చేరేందుకు సిద్ధం కావటాన్ని అభినందించారు. వారందరికీ డ్రైఫ్రూట్స్ అందజేసి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు.

కరోనాపై పోరులో వైద్యులతో పాటు పోలీసు సిబ్బంది ముందు వరుసలో ఉన్నారని.. ఈ క్రమంలో వైరస్ భారిన పడుతున్నట్లు ఎస్పీ తెలిపారు. ఎలాంటి లక్షణాలు లేకపోయినా వీరికి పాజిటివ్ గా తేలిందన్నారు. అయితే సకాలంలో చికిత్స తీసుకోవటం, సరైన జాగ్రత్తలు పాటించి త్వరగా కరోనా నుంచి కోలుకున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు గ్రామీణ ఎస్పీ విశాల్ గున్నీ ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: శ్రీవారి దర్శనాల కొనసాగింపుపై పునఃసమీక్షిస్తాం: వైవీ సుబ్బారెడ్డి

ABOUT THE AUTHOR

...view details