ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పోలీసుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం' - గుంటూరు వార్తలు

గుంటూరులో కరోనా వైరస్ బారిన పడిన పోలీస్ సిబ్బందిని అర్బన్ ఎస్పీ పరామర్శించారు. ఎవరూ అధైర్య పడవద్దని, అందరినీ తగిన విధంగా క్వారంటైన్, ఐసోలేషన్ సెంటర్స్ కు పంపించి వైద్య సేవలు అందిస్తామని భరోసా ఇచ్చారు.

guntur district
'పోలీసుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం'

By

Published : Jul 16, 2020, 11:02 PM IST

గుంటూరులో కరోనా వైరస్ బారిన పడిన పోలీస్ సిబ్బందిని అర్బన్ ఎస్పీ పరామర్శించారు. సిబ్బందికి అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. గుంటూరు అర్బన్ పరిధిలోని కేశవరెడ్డి స్కూల్ బిల్డింగ్స్ లో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపుల్లో విధులు నిర్వహించిన పోలీస్ సిబ్బంది కరోనా బారినపడ్డారు.

వారితో ఎస్పీ మాట్లాడి దైర్యం చెప్పారు. ఎవరూ అధైర్య పడవద్దని, అందరినీ తగిన విధంగా క్వారంటైన్ ఐసోలేషన్ సెంటర్స్ కు పంపించి వైద్య సేవలు అందిస్తామని భరోసా ఇచ్చారు. మిగిలిన సిబ్బంది కూడా జాగ్రత్తలను తీసుకుంటూ.. కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాలన్నారు. పోలీసులు ఎవరూ ధైర్యం కోల్పోవద్దని కోరారు. పోలీసు సిబ్బంది ఆరోగ్య విషయాల్లో అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details