గ్రామాల్లో దేవాలయాలు, ప్రార్థనా మందిరాలను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి అన్నారు. చేబ్రోలు పోలీస్‌స్టేషన్ వద్ద గ్రామ రక్షక దళాన్ని ఆయన ప్రారంభించారు. ప్రతి గ్రామంలో పది మంది యువకులను ఒక కమిటీగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికల సమాచారం పోలీసులకు అందించటం రక్షకదళం కర్తవ్యమని చెప్పారు.
గ్రామ రక్షక దళాన్ని ప్రారంభించిన గుంటూరు అర్బన్ ఎస్పీ
గుంటూరులోని చేబ్రోలు పోలీస్‌స్టేషన్ వద్ద గ్రామ రక్షక దళాన్ని జిల్లా అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి ప్రారంభించారు. దేవాలయాలను కాపాడటమే ఈ కార్యక్రమం లక్ష్యమని తెలిపారు.
గ్రామ రక్షక దళాన్ని ప్రారంభిస్తున్న గుంటూరు అర్బన్ ఎస్పీ
ముఖ్యంగా విజిబుల్ పోలీసింగ్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. అనంతరం రక్షక దళం సభ్యులకు షర్ట్స్, క్యాపులు, బూట్లు, లాఠీలు, విజిల్స్, డ్రాగన్, చార్జింగ్ లైట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ రావు, ఎస్సైలు కిషోర్, అశోక్ కుమార్, ఆర్.కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
ఇదీ చదవండి:'పిడుగురాళ్ల, నడికుడి రైల్వే స్టేషన్లలో సమస్యలు పరిష్కరించండి.. రైళ్లు ఆపించండి'