చోరీల ద్వారా పోగొట్టుకునే సొమ్ము కంటే సైబర్ నేరాల ద్వారా కోల్పోతున్న సొమ్ము ఐదు రెట్లు ఎక్కువగా ఉందని గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి అన్నారు. అందుకే ఆన్లైన్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ నేరాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. స్పందన కార్యక్రమంలో భాగాంగా ఇవాళ ఎస్పీ కార్యాలయానికి వచ్చిన వారికి సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు.
బ్యాంకు అధికారుల పేరుతో, లాటరీలు, స్నేహితుల ఫేస్బుక్ ఐడీల పేరుతో డబ్బులు అడిగే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. చరవాణిలకు వచ్చే సంక్షిప్త సందేశాల లింకులను జాగ్రత్తగా చూసుకుని క్లిక్ చేయాలన్నారు.