గుంటూరు నగరం(Guntur City)లోని సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు గుంటూరు అర్బన్ ఎస్పీ(Guntur Urban SP) ఆరీఫ్ హఫీజ్ తెలిపారు. ఇందులో భాగంగా గుంటూరు కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటాద్రి పేటను దత్తత తీసుకుని అక్కడ వారి సమస్యలు పరిష్కారం కోసం కృషి చేస్తున్నట్లు చెప్పారు. వెంకటాద్రిపేటకు సంబంధించి వాట్సాప్ గ్రూప్ (Venkatadripet Whats App Group) క్రియేట్ చేశామని ఏదైనా సమస్య ఉంటే వాట్సాప్లో పోస్ట్ చేస్తే..వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం అక్కడ రాత్రి వేళలో అల్లరిమూకలు చేసే గొడవల గురించి స్థానికుల ద్వారా తమ దృష్టికి వచ్చిందన్నారు. వెంకటాద్రిపేటలోని అన్ని సమస్యలను పరిష్కరిస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. గుంటూరు అర్బన్ పరిధిలో ప్రశాంత వాతావరణం కల్పించడానికి అన్ని విధాలా చర్యలు తీసుకుంటామన్నారు.
Guntur SP: సమస్యాత్మక ప్రాంతాలపైన ప్రత్యక దృష్టి: ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ - నేరాలపై గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరీఫ్ హఫీజ్
గుంటూరు నగరంలోని సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు గుంటూరు అర్బన్ ఎస్పీ (Guntur Urban SP) ఆరీఫ్ హఫీజ్ తెలిపారు. ఇందులో భాగంగా గుంటూరు కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటాద్రిపేటను దత్తత తీసుకుని అక్కడ వారి సమస్యలు పరిష్కారం కోసం కృషి చేస్తున్నట్లు చెప్పారు.
ఎస్పీ ఆరీఫ్ హఫీజ్
మేడికొండరు వివాహిత అత్యాచార ఘటనపై ముమ్మరంగా దర్యాప్తు జరుగుతుందన్నారు. కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే నిందితులను అరెస్ట్ చేస్తామని తెలిపారు.
ఇదీ చదవండి : CHEATING: కాల్ చేసి మీరే లక్కీ విన్నర్ అన్నారు.. డబ్బు కట్టించుకుని..