ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'హెపటైటిస్ వ్యాధిపై అప్రమత్తంగా ఉండాలి'

హెపటైటిస్ వ్యాధి అత్యంత ప్రమాదకరమని గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి పేర్కొన్నారు. వైరస్ వల్ల వచ్చే వ్యాధి కాబట్టి... అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. జిల్లా జైలులో ఏర్పాటు చేసిన హెపటైటిస్ నివారణ అవగాహన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.

Guntur Urban SP
అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి

By

Published : Jan 24, 2021, 12:47 PM IST

హెపటైటిస్ - బి వ్యాధిపై అందరూ అప్రమత్తంగా ఉండాలని గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి అన్నారు. ఆ వైరస్ సోకకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జిల్లా జైలులో నిర్వహించిన హెపటైటిస్ నివారణ అవగాహన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.

పౌష్టికాహారం తీసుకోవడం వల్ల వ్యాధినిరోధక శక్తి పెరిగి ఇలాంటి సమస్యలు దరిచేరవని చెప్పారు. అనంతరం హెపటైటిస్ వ్యాధి నిర్ధారణ పరీక్షలను ఎస్పీ చేయించుకున్నారు. ఈ కార్యక్రమానికి జైలు సూపరింటెండెంట్, సిబ్బంది హజరయ్యారు.

ABOUT THE AUTHOR

...view details