గంజాయి విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను గుంటూరు అర్బన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఒక మైనర్ ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. పాత గుంటూరుకి చెందిన యువకులు చెడు వ్యవసనాలకు అలవాటు పడి.. విశాఖ ఏజెన్సీ నుంచి గంజాయిని అక్రమంగా తీసుకొస్తున్నారని ఎస్పీ అన్నారు. వాటిని బాటిళ్లలో లిక్విడ్ రూపంలో విక్రయిస్తున్నారని పేర్కొన్నారు.
గంజాయి విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులు అరెస్ట్
చేడు వ్యసనాలకు బానిసై.. సునాయాసంగా డబ్బులు సంపాదించేందుకు.. గంజాయి విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను గుంటూరు అర్బన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఒక మైనర్ ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితుల నుంచి 8 కేజీల గంజాయి, 10 గంజాయి లిక్విడ్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఎటుకురు రోడ్డులోని బుడంపాడు బైపాస్ వద్ద గంజాయిని విక్రయిస్తుండగా.. నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ చెప్పారు. వీరిలో ఒక మైనర్ ఉన్నట్లు తెలిపారు. ఇద్దరిపై గతంలో అనేక కేసులు ఉన్నాయని వివరించారు. నిందితులకు గంజాయి సరఫరా చేస్తున్న కట్టేంపూడి వినీల్ పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. వీరి నుంచి 8 కేజీల గంజాయి, 10 గంజాయి లిక్విడ్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. గంజాయి, మత్తు పదార్థాలు రవాణా చేస్తూ.. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.