ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంటూరులో ఆటో ప్రయాణికులకు గులాబీలు ఇచ్చిన పోలీసులు - గుంటూరు తాజా న్యూస్​

మీ భద్రతే మా బాధ్యత అంటూ.. గుంటూరు అర్బన్ పోలీసులు నగరంలోని పలు ప్రాంతాల్లో వినూత్నంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. ఆటోలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు, డ్రైవర్లకు గులాబీ పూలు ఇచ్చి ప్రమాదాలపై పలు సూచనలు చేశారు.

guntur urban police conducting awareness programs in guntur district
వినూత్నంగా అవగాహన కార్యక్రమాలను చేపట్టిన గుంటూరు అర్బన్ పోలీసులు

By

Published : Jan 9, 2021, 7:03 PM IST

ప్రయాణికుల రక్షణే ధ్యేయంగా గుంటూరులోని పలు ప్రాంతాల్లో పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఆటోలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు, డ్రైవర్లకు గులాబీ పూలు ఇచ్చి ప్రమాదాలపై అవగాహన కల్పించారు. ప్రయాణికులు ఆటోలో ఉన్న టోల్ ఫ్రీ, పోలీస్ నెంబర్లు గుర్తుంచుకోవాలని సూచించారు. ఏదైనా ప్రమాదం జరిగితే.. విలువైన వస్తువులు మర్చిపోయినా.. ఆ నెంబర్లకు ఫోన్​ చేస్తే వెంటనే స్పందిస్తామని అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు. నేరాలను నియంత్రించాలనే ఉద్ధేశంతో.. ఆటోల్లో పోలీస్ సిబ్బంది నెంబర్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

మంగళగిరిలో పర్యటించిన ఎస్​ఈసీ రమేశ్​ కుమార్​

ABOUT THE AUTHOR

...view details