నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో ఉన్న విజయవాడ, గుంటూరు ప్రధానమైన రైల్వే జంక్షన్లు. విజయవాడ నుంచి చెన్నై వైపు వెళ్లేందుకు రెండో లైన్ అందుబాటులో ఉన్నప్పటికీ.. రద్దీ ఎక్కువగా ఉంటోంది. గుంటూరు నుంచి తెనాలి వరకు ఒకే మార్గం ఉండటంతో అక్కడ సామర్థ్యం 125 శాతం మించిపోయింది.
ఈ మార్గంలో డబ్లింగ్ పనులు తప్పనిసరైంది. ప్రాజెక్టు 2011లో మంజూరైనా.. రెండేళ్లలో పనులు వేగం పుంజుకున్నాయి. ఇటీవలే రెండో లైన్ నిర్మాణాన్ని విద్యుదీకరణతో పూర్తి చేశారు. శుక్రవారం రేపల్లె- సికింద్రాబాద్ ప్యాసింజర్ రైలును ప్రయోగాత్మకంగా రెండో లైన్ లో నడిపారు. ఎక్కడా ఇబ్బంది లేకపోవటంతో అధికారులు వినియోగంలోకి తెచ్చేందుకు సిద్ధమయ్యారు.
సుమారు 25.47 కిలోమీటర్ల దూరం ఉన్న ఈ మార్గాన్ని డబ్లింగ్ చేసేందుకు 147 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఇందులో వేజెండ్ల, సంగం జాగర్లమూడి, అంగలకుదురు స్టేషన్లు ఉన్నాయి. ఆయా స్టేషన్లలో భవనాలను ఆధునీకరించారు. అధునాతన సిగ్నలింగ్ వ్యవస్థను, లెవల్ క్రాసింగ్ లను, రైల్వే అండర్ బ్రిడ్జిలను ఏర్పాటు చేశారు.
విజయవాడ- తెనాలి మార్గంలో ఉన్న రద్దీని తగ్గించటానికి ప్రత్యామ్నాయంగా గుంటూరు - తెనాలి ఉపయోగపడనుంది. గుంటూరు నుంచి చెన్నై మార్గంలో సరుకు రవాణా విపరీతంగా పెరిగింది. సింగిల్ లైన్ సామార్థ్యం సరిపోవటం లేదు. ఇక మీదట ప్రయాణికులకు, సరుకు రవాణాకు రద్దీ సమస్య లేకుండా చకచకా.. రైళ్లు పరుగులు తీయనున్నాయి.
డబుల్ లైన్ రెడీ.. రైలు రాటమే ఆలస్యం - heavy croud
రాజధాని ప్రాంతంలో రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధికి ముందడుగు పడింది. గుంటూరు- తెనాలి మధ్య రెండో లైను పనులు పూర్తయ్యాయి. ఈమార్గంలో అదనపు రైళ్ల ప్రారంభానికి మార్గం సుగమమైంది.
గుంటూరు- తెనాలి డబ్లింగ్
ఇది కూడా చదవండి.