ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కుంభకోణాలకు చిరునామాగా జగన్ ప్రభుత్వం' - కుంభకోణాలకు చిరునామాగా జగన్ ప్రభుత్వం

108 వాహనాల కొనుగోళ్లలో 307 కోట్లు ప్రజాధనాన్ని వైకాపా నేతలు దోపిడీ చేశారని గుంటూరు జిల్లా తెదేపా నేతలు విమర్శించారు. మద్యం, మట్టి, ఇసుక, ఇళ్ల పట్టాలు, బ్లీచింగ్ పౌడర్​లలో ఆ పార్టీ నేతలు కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డారని నేతలు ఆరోపించారు.

'కుంభకోణాలకు చిరునామాగా జగన్ ప్రభుత్వం'
'కుంభకోణాలకు చిరునామాగా జగన్ ప్రభుత్వం'

By

Published : Jun 23, 2020, 4:02 PM IST

జగన్ ప్రభుత్వం మొదటి ఏడాదిలోనే కుంభకోణాలకు చిరునామాగా మారిందని గుంటూరు జిల్లా తెదేపా నాయకులు విమర్శించారు. మద్యం, మట్టి, ఇసుక, ఇళ్ల పట్టాలు, బ్లీచింగ్ పౌడర్​లలో ఆ పార్టీ నేతలు కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డారని నేతలు ఆరోపించారు. 108 వాహనాల కొనుగోళ్లలో 307 కోట్లు ప్రజాధనాన్ని వైకాపా నేతలు దోపిడీ చేశారన్నారు.

అనుభవం ఉన్న కంపెనీని పక్కనపెట్టి తమకు అనుకూలంగా నడిచే అరవిందో ఫౌండేషన్​కి 108 వాహనాల నిర్వహణ బాధ్యతలను అప్పగించారని మండిపడ్డారు. అరవిందో ఫౌండేషన్ చైర్మన్ రాంప్రసాద్ రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి వియ్యంకులు కాదా అని నేతలు ప్రశ్నించారు.

ABOUT THE AUTHOR

...view details