బెస్ట్ అవెలబుల్ స్కూల్(బీఏఎస్) పథకం ద్వారా గుంటూరు సెయింట్ జోసఫ్ పాఠశాలలో చదువుతున్న 98 మంది విద్యార్థులను వసతి గృహం అందుబాటు లేదనే కారణంగా పాఠశాల యాజమాన్యం తొలిగించింది. ఈ విషయమై విద్యార్థుల తల్లిదండ్రులు గుంటూరు జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. బీఏఎస్ పథకం ద్వారా పాఠశాలలో చేర్చుకుని నెలరోజులు గడిచాక సెయింట్ జోసఫ్ స్కూల్ యాజమాన్యం విద్యార్థులను అకారణంగా తొలిగించిందని ఆరోపించారు.
98 మంది విద్యార్థులకు టీసీలు... తల్లిదండ్రుల ఆందోళన - BAS scheme
బీఏఎస్ పథకం ద్వారా విద్యార్థులను చేర్చుకున్న గుంటూరు సెయింట్ జోసఫ్ పాఠశాల యాజమాన్యం.. వసతులు అందుబాటులో లేవని 98 మంది విద్యార్థులను తొలగించింది. విద్యాసంస్థ తీరుపై తల్లిదండ్రులు ఆందోళన చేశారు. గుంటూరు విద్యాశాఖ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు.
నెలరోజుల పాటు పాఠాలు బోధించటమే కాక, యూనిఫాం, పుస్తకాలను కొనుగోలు చేయించారని ఆవేదన చెందారు. పాఠశాలలోని వసతి గృహం శిథిలమైనందున, తమ స్కూల్కు బీఏఎస్ వర్తించదంటూ యాజమాన్యం చేతులెత్తేసి... మరో పాఠశాలలో చేరాలని చెబుతున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. వారం రోజుల్లో మొదటి యూనిట్ పరీక్షలు జరగనున్నాయని, ఇప్పుడు విద్యార్థులను తొలిగిస్తే...విద్యార్థులు ఒత్తికి గురవుతారని ఆవేదన చెందారు. ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి తమ పిల్లల భవిష్యత్తును కాపాడాలని వేడుకున్నారు.
ఇదీ చదవండి : 'సన్ పెడల్ రైడ్' యువకుల దేశవ్యాప్త యాత్ర