ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'గుడ్డిగా నమ్మి మోసపోవద్దు.. ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దు'

కాలంతో పాటు సాంకేతికలో అనేక మార్పులు వస్తున్నాయి. ప్రతీ చిన్న విషయానికి చరవాణి తీయాల్సిన పరిస్థితి. ఫేస్ బుక్ , ఇన్ స్టా, వాట్సాప్ అంటూ ఎన్నో యాప్స్. ఇక్కడే ప్రమాదం ముంచుకొస్తోంది. అపరిచితులతో ఏర్పడిన స్నేహం ప్రాణాల మీదికి తెస్తోంది. ఇటీవల జరిగిన హత్యలు, దాడులు అంతర్జాలంలో అప్రమత్తతో ఉండాలన్న విషయాన్ని తెలియజేస్తున్నాయి. పోలీసులు సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు.

http://10.10.50.85:6060/reg-lowres/18-August-2021/ap_gnt_09_18_attn_etv_bharat_beware_of_social_media_activities_bytes_pkg_3067949_1808digital_1629301743_365.mp4
http://10.10.50.85:6060/reg-lowres/18-August-2021/ap_gnt_09_18_attn_etv_bharat_beware_of_social_media_activities_bytes_pkg_3067949_1808digital_1629301743_365.mp4

By

Published : Aug 19, 2021, 2:47 PM IST

'గుడ్డిగా నమ్మి మోసపోవద్దు.. ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దు'

అంతర్జాలం రాకతో ప్రపంచమే కుగ్రామంగా మారిపోయింది. భావ వ్యక్తీకరణ సులభతరమైంది. ఎక్కడ నుంచి ఎవరితోనైనా సంభాషించే అవకాశం ఏర్పడింది. వాట్సప్, ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ ఖాతాలను వీక్షించే నెటిజన్లు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్దీ ఉన్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో చరవాణి ముఖ్యమైంది. అయితే.. ఈ చరవాణి, అంతర్జాల ఖాతాలు ఎంతవరకూ మేలు చేస్తున్నాయి.. ఎంత వరకూ మనకు ప్రమాదాన్ని కలిగిస్తున్నాయి అన్నదే.. ఇప్పుడు చర్చనీయాంశమైంది. అంతర్జాలంలో అపరిచిత పరిచయాలు విషాదాన్ని మిగుల్చుతున్న ఘటనలు.. అందరిలో మార్పును తీసుకురావాలన్న సూచనలు.. పోలీసుల నుంచి వ్యక్తమవుతున్నాయి.

ఇటీవల.. గుంటూరులో రమ్య అనే బీటెక్ విద్యార్థిని హత్యోదంతం రాష్ట్రవ్యాప్తంగా ఓ కుదుపు కుదిపేసింది. గతంలోనూ ఇలాంటి సంఘటనలు గుంటూరు వెలుగు చూశాయి. మరో చోట డబ్బు కోసం ఓ భర్త కిరాతకంగా ప్రవర్తించాడు. ఏకంగా భార్య నగ్న చిత్రాలనే అంతర్జాలంలో పెట్టాడు. మరో ఘటనలో ఓ విద్యార్థిని మోసం చేసి ఆమె నగ్న చిత్రాలు అప్ లోడ్ చేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో అంతర్జాలంలో అప్రమత్తత అవసరమని పోలీసులు చెబుతున్నారు.

యువత ఎక్కువగా సామాజిక మాధ్యమాలను వినియోగిస్తున్నారు. అయితే సైబర్ మోసాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఎవరిని పడితే వారిని గుడ్డిగా నమ్మొద్దు. మా విజ్ఞప్తి ఏంటంటే ప్రతీ ఒక్కరిని అనుమానించండి . పిల్లలను గమనించాలని.. తల్లిదండ్రులను కోరుతున్నాం.

-ఆరిఫ్ హఫీజ్, విశాల్ గున్నీ. గుంటూరు అర్బన్, రూరల్ ఎస్పీలు

ఇదీ చదవండి:నరసరావుపేట శివారులో వాచ్‌మన్ దారుణ హత్య

ABOUT THE AUTHOR

...view details