గుంటూరు జిల్లా గురజాల రెవెన్యూ డివిజన్ పరిధిలో... రేపటి నుంచి జరగనున్న మూడోదశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఏర్పాట్లను ఎస్పీ విశాల్ గున్నీ పరిశీలించారు. పిడుగురాళ్ల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని తుమ్మలచెరువు ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని సందర్శించారు. ప్రశాంత వాతావరణంలో నామినేషన్ ప్రక్రియ జరిగే విధంగా అన్ని చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.
మూడో విడత నామినేషన్ ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తి : గుంటూరు ఎస్పీ - తుమ్మలపల్లిలో ఎస్పీ పర్యటన
గుంటూరు జిల్లా గురజాల రెవెన్యూ డివిజన్లో ఎస్పీ విశాల్ గున్నీ పర్యటించారు. తుమ్మలచెరువు నామినేషన్ కేంద్రాన్ని సందర్శించిన ఎస్పీ... నామపత్రాలు దాఖలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. నామినేషన్ ప్రక్రియలో సమస్యలు ఎదురైతే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.
ఎస్పీ విశాల్ గున్నీ
ముందస్తు భద్రత చర్యలలో భాగంగా... సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక గ్రామాలను గుర్తించి, ఆయా గ్రామాల్లో అల్లర్లు సృష్టించే వారిని బైండోవర్ చేశామని చెప్పారు. నామినేషన్ ప్రక్రియలో సమస్యలు ఎదురైతే వెంటనే దగ్గరలోని పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని సూచించారు. అధికారులకు సమాచారాన్ని అందించాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.
ఇదీచదవండి.