తన సమస్యను పరిష్కరించాలని కోరుతూ.. గుంటూరు గ్రామీణ ఎస్పీ కార్యాలయానికి విభిన్న ప్రతిభావంతురాలు వచ్చింది. స్టేషన్లోకి రాలేకపోతున్న ఆమె పరిస్థితిని తెలుసుకుని ఎస్పీ.. స్వయంగా బయటకు వచ్చారు. తన సమస్య ఏంటో అడిగి తెలుసుకుని.. వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ఎస్పీ కార్యాలయానికి మహిళ.. ఎదురెళ్లి ఫిర్యాదు స్వీకరించిన విశాల్ గున్నీ - sp vishal gunni helps to handicapped women in guntur
సమస్య పరిష్కారం కోసం స్టేషన్కు వచ్చిన విభిన్న ప్రతిభావంతురాలికి స్వయంగా ఎస్పీనే ఎదురెళ్లి ఫిర్యాదును స్వీకరించారు. ఆమె ఇబ్బందులను తెలుసుకొని.. వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన తుమ్మ సురేఖ దేవి అనే విభిన్న ప్రతిభావంతురాలు గ్రామ, వార్డు సచివాలయం పరీక్షలో ఎంపికై.. మహిళా సంరక్షణ అధికారిగా నియమించబడ్డారు. ఆమెకు నూజెండ్ల మండలం ములకులరు గ్రామంలో పోస్టింగ్ ఇచ్చారు. అయితే రోజు అక్కడికి వెళ్లిరావాలంటే ఇబ్బందిగా ఉందని.. తనను మంగళగిరికి ట్రాన్స్ఫర్ చేయాలని ఎస్పీ విశాల్ గున్నీని కోరారు. పరిశీలించి తగిన న్యాయం చేస్తానని ఎస్పీ హామీ ఇచ్చారు.
ఇదీ చదవండీ..హనుమంతుడి జన్మస్థానం అంజనాద్రే.. నవమినాడు నిరూపిస్తాం: తితిదే