గుంటూరు జిల్లా మంగళగిరి శ్రీలక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో జరిగే ముక్కోటి వేడుకలకు అన్నివిధాల భద్రతా చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ అమ్మిరెడ్డి చెప్పారు. మంగళవారం రాత్రి మంగళగిరిలో పర్యటించిన ఎస్పీ... వైకుంఠ ఏకాదశి రోజున తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై పోలీసులతో సమీక్షించారు. ఆలయంలో ఏర్పాటు చేసిన క్యూ లైన్లను పరిశీలించారు.
కరోనా నేపథ్యంలో భక్తులంతా భౌతిక దూరం పాటించాలని కోరారు. ఆలయం వద్ద ప్రత్యేక కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేస్తున్నామన్న ఆయన... మొత్తం 500 మందితో భద్రతా చర్యలు చేపట్టామన్నారు. వార్డు వాలంటర్ల సేవలను వినియోగించుకుంటున్నామని చెప్పారు.