గుంటూరు జిల్లా దుర్గి మండలం ధర్మవరంలో గత ఆర్ధరాత్రి రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణపైవిచారణ చేపట్టినట్లు గ్రామీణ ఎస్పీ విజయరావు చెప్పారు.పోలీసులపై దాడి చేయడమంటే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడమేనని ఆయన అన్నారు.బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.ఘటనలో పోలీసుల తీరుపైనా అంతర్గత విచారణ చేపట్టామన్న ఎస్పీ...వారి పాత్ర ఉందని తేలితే శాఖా పరంగా చర్యలు తీసుకుంటామన్నారు.భవిష్యత్తులో పల్నాడులో ఊరేగింపులు,ప్రదర్శనలకు ముందస్తు అనుమతి తప్పనిసరని స్పష్టం చేశారు
"ధర్మవరం ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు" - గుంటూరులో ఎస్పీ విజయరావు వార్తలు
ధర్మవరం తిరునాళ్లలో పోలీసులపై దాడి ఘటనపై విచారణ చేపడతున్నట్లు ఎస్పీ విజయరావు చెప్పారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
!["ధర్మవరం ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు"](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5097109-393-5097109-1574035420326.jpg)
మీడియాతో మాట్లాడుతున్న ఎస్పీ విజయరావు