లాక్డౌన్ సమయంలో రక్తపు కొరత తీవ్రంగా ఉందని... రక్తదానానికి ప్రజలు ముందుకు రావాలని గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి పిలుపునిచ్చారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా రక్తం ఇచ్చేవారు తక్కువయ్యారని..తగిన జాగ్రత్తలతో రక్తదానం చేయవచ్చునని ఆయన స్పష్టం చేశారు.
రక్తదానం చేసేందుకు యువత ముందుకు రావాలి: ఎస్పీ అమ్మిరెడ్డి - రక్తదానం చేసేందుకు ముందుకు రావాలి
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా రక్తం ఇచ్చేవారు తక్కువయ్యారని..తగిన జాగ్రత్తలతో రక్తదానం చేయవచ్చునని గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి స్పష్టం చేశారు. రక్తదానం చేసేందుకు యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
రక్తదానం చేసేందుకు ముందుకు రావాలి: ఎస్పీ అమ్మిరెడ్డి
దేశసేవలో అమరులైన జవాన్లకు నివాళులర్పిస్తూ...గుంటూరులోని రెడ్ క్రాస్ సొసైటీ, మద్య విమోచన ప్రచార కమిటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. శిబిరాన్ని ప్రారంభించిన ఎస్పీ..రక్తదానం చేసేందుకు ప్రధానంగా యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు.