మహిళలతో పోలీసులు అసభ్యంగా ప్రవర్తిస్తే ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని, అవసరం అయితే సర్వీస్ నుంచి తొలగించే అవకాశాలు ఉన్నాయని గుంటూరు రేంజ్ ఐజీ వినీత్ బ్రిజ్ లాల్ హెచ్చరించారు. స్టేషన్ కి వచ్చిన ఒక బాధితురాలితో అరండల్ పేట ఎస్ఐ బాలకృష్ణ అసభ్యంగా ప్రవర్తించాడని విచారణలో తేలిందన్నారు. విచారణ అనంతరం ఎస్ఐ. బాలకృష్ణతో పాటు హనుమంతరావు, రాము అనే ఇద్దరు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు వేసినట్లు ఐజీ చెప్పారు. కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అరండల్ పేట సీఐ శ్రీనివాసరావుతో పాటు డీఎస్పీ రామారావుకి కూడా చార్జ్ మెమో ఇచ్చారన్నారు.
యువతితో అసభ్య ప్రవర్తన.. పోలీసులపై వేటు
మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తే.. పోలీసులైనా సరే ఉపేక్షించేది లేదని గుంటూరు రేంజ్ ఐజీ వినీత్ బ్రిజ్ లాల్ హెచ్చరించారు. ఓ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఒక ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లపై వేటు వేసినట్లు ఆయన తెలిపారు.
యువతిపై అసభ్యంగా ప్రవర్తించిన పోలీసులపై వేటు...