సర్పంచులుగా ఎన్నికై ఏడాది గడిచినా.. తమకు రావాల్సిన నిధులు, విధుల విషయంలో ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని గుంటూరు జిల్లా సర్పంచుల సంఘం విమర్శించింది. ఈ మేరకు బ్రాడిపేటలో సర్పంచుల సంఘం ముఖ్య నాయకుల సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా మాట్లాడిన సంఘ అధ్యక్షుడు పాపారావు... కొత్త సర్పంచులకు ఇప్పటి వరకూ గౌరవ వేతనం కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 15వ ఆర్థిక సంఘం నిధులను వెంటనే తమ ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ప్రత్యేక కార్యాచరణతో వచ్చే నెల నుంచి పోరాటానికి సిద్ధమని ప్రకటించారు.