గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో జిల్లా రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ పర్యటించారు. పట్టణంలో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న ఏనుగుల బజారు, వరవకట్ట ప్రాంతాలను పరిశీలించారు. ప్రస్తుతం ఏనుగుల బజారులో 28 యాక్టివ్ కేసులు, వరకట్టలో ఒక కేసు ఉన్నట్లు ఎస్పీ తెలిపారు.
'కరోనాపై ఆందోళన వద్దు.. అధికారులు చెప్పింది వినండి.. జాగ్రత్తలు పాటించండి'
కరోనా విషయంలో ప్రజలు ఆందోళనకు గురి కావద్దని.. అధికారులు చేసే సూచనలు పాటించాలని గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ పిలుపునిచ్చారు. నరసరావుపేట పట్టణంలో ఆయన పర్యటించారు. వైరస్ వ్యాప్తి నియంత్రణకు చేపట్టాల్సిన చర్యల గురించి స్థానిక పోలీసులకు సూచనలు జారీ చేశారు.
నరసరావుపేటలో రూరల్ ఎస్పీ పర్యటన !
కరోనా వ్యాప్తి నివారణకు చేపట్టాల్సిన చర్యల గురించి స్థానిక పోలీసులకు పలు సూచనలు చేశారు. కరోనా నియంత్రణకు పోలీసులు, అధికారులు సమన్వయంగా పని చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రజలు ఆందోళనకు గురికాకుండా అధికారులు తెలిపిన సూచనలు పాటించాలన్నారు.