గుంటూరు జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సరళిని గ్రామీణ ఎస్పీ విశాల్ గున్నీ పరిశీలించారు. జిల్లాలోని చిలకలూరిపేట నియోజకవర్గం పరిధిలోని యడ్లపాడు, తిమ్మాపురం, లింగంగుంట్ల గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలలో పర్యటించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. ఆయనతోపాటు నరసరావుపేట డీఎస్పీ విజయ భాస్కర్, చిలకలూరిపేట రూరల్ సీఐ సుబ్బారావు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు.
గుంటూరు జిల్లాలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన విశాల్ గున్నీ - గుంటూరు జిల్లా వార్తలు
గుంటూరు జిల్లాలో పరిషత్ ఎన్నికల పోలింగ్ సరళిని రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ పరిశీలించారు. జిల్లాలోని పలు పోలింగ్ బూత్‌లను సందర్శించారు.
గుంటూరు జిల్లాలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన విశాల్ గున్నీ