సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే పోస్టుల పట్ల జాగ్రత్తగా ఉండాలని గుంటూరు గ్రామీణ ఎస్పీ విశాల్ గున్నీ ప్రజలకు సూచించారు. మత ప్రాతిపదికన విద్వేషాలు రెచ్చగొట్టాలని కొందరు యత్నిస్తున్నారని వెల్లడించారు. రెండు వర్గాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. జిల్లాలో ఆలయాల రక్షణకు జియోట్యాగ్, సీసీ కెమెరాల ఏర్పాటు చేశామన్నారు. సామాజిక మాధ్యమాల నియంత్రణకు 8 ప్రత్యేక బృందాలు నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు.
మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తే ఉపేక్షించేది లేదు: జిల్లా ఎస్పీ - సోషల్ మీడియా పోస్టులపై గుంటూరు గ్రామీణ ఎస్పీ
రెండు వర్గాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తే ఉపేక్షించేది లేదని గుంటూరు గ్రామీణ ఎస్పీ విశాల్ గున్నీ స్పష్టం చేశారు. మత ప్రాతిపదికన విద్వేషాలు రెచ్చగొట్టాలని కొందరి యత్నిస్తున్నట్లు వెల్లడించారు. సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే పోస్టుల పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు.
![మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తే ఉపేక్షించేది లేదు: జిల్లా ఎస్పీ guntur rural sp on social media posts](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10191302-417-10191302-1610281855047.jpg)
రెండు వర్గాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తే ఉపేక్షించేది లేదు