ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Guntur Rape and Murder Case: 'పోలీసులు ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి'

Guntur rape and murder case: పోలీసులు తన భార్యపై ఆరోపణలు చేయడం దారుణమని.. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలానికి చెందిన మృతురాలి భర్త ఆవేదన వ్యక్తం చేశారు. పోస్టుమార్టం చేయకముందే అత్యాచారం జరగలేదని పోలీసులు ఎలా చెబుతారని ప్రశ్నించారు.

Guntur rape and murder case
పోలీసులు తన భార్యపై ఆరోపణలు చేయడం దారుణమన్న గుంటూరు బాధితురాలి భర్త

By

Published : Apr 29, 2022, 12:45 PM IST

Guntur rape and murder case: పోలీసులు తన భార్యపై ఆరోపణలు చేయడం దారుణమని.. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలానికి చెందిన మృతురాలి భర్త. ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోతే ఎస్పీ కార్యాలయం ముందు ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. పోస్టుమార్టం చేయకముందే అత్యాచారం జరగలేదని పోలీసులు ఎలా చెబుతారని ప్రశ్నించారు.

పోలీసులు తన భార్యపై ఆరోపణలు చేయడం దారుణమన్న గుంటూరు బాధితురాలి భర్త

సీపీఎం నాయకుల పరామర్శ.. దిశ, నిర్భయ లాంటి చట్టాలు ఉన్నా మహిళల ప్రాణాలు కాపాడలేకపోతున్నాయని.. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఆరోపించారు. తుమ్మపూడిలో హత్యకు గురైన మహిళ కుటుంబ సభ్యులను.. సీపీఎం నాయకులు పరామర్శించారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలా తోడుంటామని హామీ ఇచ్చారు.

పట్టపగలే మహిళల పట్ల ఇంత ఘోరాలు జరుగుతుంటే రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా అని శ్రీనివాసరావు అనుమానం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటన మానవ నాగరికత సమాజంలో ఉన్నామా.. లేదా అనే సందేహం కలుగుతోందని చెప్పారు. బాధిత కుటుంబానికి రూ.25లక్షల పరిహారం, ఇల్లు నిర్మించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత కథనాలు:

ABOUT THE AUTHOR

...view details