ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించం' - సైంటిఫిక్ అసిసెంట్ల పరీక్ష వార్తలు

సైంటిఫిక్ అసిస్టెంట్ల పోస్టుల భర్తీకి ఈ నెల 6న జరగనున్న రాతపరీక్షకు అన్ని ఏర్పాట్లు చేశామని గుంటూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమవర్మ వెల్లడించారు. పరీక్షకు గంట ముందుగానే అభ్యర్థులు పరీక్షా కేంద్రాల్లో ఉండాలని సూచించారు. కొవిడ్ బాధితుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు.

dig trivikram varma
dig trivikram varma

By

Published : Dec 4, 2020, 7:39 PM IST

మీడియా సమావేశంలో గుంటూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమవర్మ
రాష్ట్రంలోని ఫోరెన్సిక్ సైన్స్ ప్రయోగశాలలో 58 సైంటిఫిక్ అసిస్టెంట్ల భర్తీకి ఈ నెల 6న రాత పరీక్ష జరగనుంది. దీనికి అన్ని ఏర్పాట్లు చేశామని గుంటూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమవర్మ తుళ్లూరులో చెప్పారు. గుంటూరు పరిధిలో మొత్తం 9 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆచార్యుల పర్యవేక్షణలో పరీక్షలు జరుగుతున్నాయని వెల్లడించారు.

కొవిడ్ బాధిత అభ్యర్థులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని డీఐజీ తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి ఒంటి గంట వరకు పరీక్ష జరుగుతుందని.. అభ్యర్థులంతా గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలన్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతించబోమని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details