ఓ వైపు కొవిడ్ సెకండ్ వేవ్ విజృంభిస్తుంటే.. మరోవైపు పెట్రో ధరలు మోతెక్కిస్తున్నాయి. కరోనా వేళ ప్రజల ఆదాయం పడిపోగా.. పెట్రో ధరలు మాత్రం పైపైకి ఎగబాకుతున్నాయి. తాజాగా లీటరు పెట్రోల్ ధర వంద రూపాయలు దాటింది. వాహనదారులు బెంబేలెత్తున్నారు. పెట్రో ధరల పెంపుపై గుంటూరులోని సామాన్య ప్రజానీకం పెదవి విరుస్తున్నారు.
ప్రభుత్వాల పన్నుల మోతకు తోడు అయిల్ కంపెనీల అత్యాశతో తమ జేబులు ఖాళీ అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది 75 రూపాయుల ఉన్న పెట్రోలు ధర.. ఒక్కసారిగా ఇప్పుడు 25 రూపాయలకు పైగా పెరిగిందని ఆవేదన చెందుతున్నారు.