సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు చేపట్టిన జస్టిస్ ఎన్.వి. రమణకు శుభాకాంక్షలు తెలుపుతూ గుంటూరులో ఫ్లెక్సీలు వెలిశాయి. తెలుగుబిడ్డ రాజ్యాంగబద్ధమైన ఉన్నత పదవిని అలంకరించడం సంతోషకరమంటూ గుంటూరు నగరంలోని ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. జస్టిస్ రమణ ఉన్నత విద్యాభ్యాసం గుంటూరు జిల్లాలోనే జరిగింది. అమరావతిలో డిగ్రీ చదవగా.. నాగార్జున విశ్వవిద్యాలయంలో న్యాయవిద్య పూర్తి చేశారు. ఇపుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పీఠాన్ని అధిష్టించడంతో.. అభినందనలు తెలుపుతూ బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు ఫ్లెక్సీలు పెట్టారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి శుభాకాంక్షల వెల్లువ - సీజైఐకు గుంటూరులో ఫ్లెక్సీలు తాజా వార్తలు
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తెలుగు గడ్డ బిడ్డ బాధ్యతలు చేపట్టటం పట్ల రాష్ట్రవ్యాప్తంగా హర్షం వ్యక్తం చేశారు. జస్టిస్ ఎన్వీ రమణకు గుంటూరులో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి శుభాకాంక్షలు తెలిపారు.
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి... గుంటూరులో శుభాకాంక్షలు