గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కృష్ణాయపాలెం దీక్షా శిబిరం వద్ద ఏర్పాటుచేసిన బుద్ధుడి విగ్రహాన్ని గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గ తెదేపా అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్, తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి గంజి చిరంజీవి ఆవిష్కరించారు. రైతులు, మహిళలు చేస్తున్న దీక్షకు మద్దతు ప్రకటించారు.
జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా... బుద్ధుడి విగ్రహం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని నేతలు తెలిపారు.