ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

OLD WOMEN ATHLET: ఆరుపదుల వయసులోనూ అలుపెరగని పరుగు!

పరుగే శ్వాస.. పరుగే ధ్యాస... ఒక్కమాటలో చెప్పాలంటే పరుగే ఆమెకు సర్వస్వం. రోజూ వ్యాయామం చేయడానికే యువత బద్ధకించే ఈ రోజుల్లో.. 59ఏళ్ల వయసులోనూ ఆమె సాగిస్తున్న పరుగుల ప్రస్థానం ఎందరికో ఆదర్శనీయం.

guntur-old-women-athlet-vijaya-special-story
ఆరుపదుల వయసులోనూ అలుపెరగని పరుగు!

By

Published : Dec 24, 2021, 12:16 PM IST

ఆరుపదుల వయసులోనూ అలుపెరగని పరుగు! ఆరుపదుల వయసులోనూ అలుపెరగని పరుగు!

50 ఏళ్లు వచ్చాయంటే చాలు కాళ్లు, కీళ్ల నొప్పులతో తెగు ఇబ్బంది పడిపోతుంటారు చాలా మంది. అంతేనా తమ పనులు తాము చేసుకోలేక... కనీసం అడుగు తీసి అడుగు వేయలేక వేరే వాళ్లపై ఆధారపడతారు. కానీ ఆరు పదుల వయసకు దగ్గరొచ్చినా ఆమె మాత్రం అలుపెరగకుండా పరుగులు పెడుతూ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.

గుంటూరుకు చెందిన ఈ మహిళా అథ్లెట్ పేరు విజయ. వయసు 59.. పతకాలు 259. ఈ గణాంకాలే ఆమె ప్రతిభకు నిదర్శనం. 18ఏళ్లుగా పరుగులు తీస్తూనే ఉన్నారు. ఇటీవలే వారణాసిలో జరిగిన జాతీయస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో రెండు పసిడి, రెండు రజత, ఒక కాంస్యం పతకం సాధించారు. 40 ఏళ్ల క్రితం చిత్తూరు నుంచి గుంటూరుకు వలస వచ్చిన ఆమె... భర్త మృతి తర్వాత ఇద్దరు పిల్లలను పోషిస్తూ వచ్చారు. ఆమె ప్రతిభ తెలుసుకున్న జిల్లా యంత్రాంగం కస్తూర్బా విద్యా కేంద్రంలో వ్యాయామ ఉపాధ్యాయురాలిగా నియమించింది.

మా ఇంటి పక్కన ఓ అమ్మాయి లావుగా ఉండేది. ఆమె వాకింగ్​కి వస్తుంటే... ఆమెతో పాటే నేను వచ్చి వాకింగ్ చేసేదాన్ని. ఇక్కడ జిమ్ ట్రైనర్ కృష్ణ అని చెప్పి అమ్మా నువ్వు చీర దోపుకొని బాగా ఉరుకుతున్నావు. ఎక్కడైనా పోటీలో పాల్గొనొచ్చు కదా అంటే... నాకవేవి తెలియవు సార్ అంటే... మేం పంపిస్తామని చెప్పి ఆయనే పంపించారు. నేను చనిపోయేలోపు ఏదో ఒకటి సాధించాలనేది నాలోపల ఉంది. - విజయ, మహిళా అథ్లెట్

విజయ ఇప్పటికీ 21 కిలోమీటర్ల హాఫ్ మారథాన్ సహా వివిధ పరుగు పోటీల్లో తనదైన ముద్ర వేస్తున్నారు. దేశవిదేశాల్లో అనేక పతకాలు సాధించారు. ప్రతి ఒక్కరికీ వ్యాయామం అనేది తప్పనిసరి అని సూచిస్తున్నారు.

పోలీసోల్లు కూడా నాకు ఎంకరేజ్​మెంట్ చాలా చేస్తున్నారు. పోలీసోల్లు కూడా చేయలేరు 40 రౌండ్లు, 50 రౌండ్లు. ఎండాకాలం లేదు వానాకాలం లేదు... ఓ చీకటి లేదు, ఓ వెలుతురు లేదు. నేషనల్ అనగానే నాకు భయం వచ్చి నేను గెలుస్తానా లేదా అని రాత్రి 11, 12 గంటలకి వచ్చి ప్రాక్టీస్ చేసేదాన్ని. నాకు ఓ బీపీ లేదు షుగరూ లేదు. - విజయ, మహిళా అథ్లెట్

త్వరలో జపాన్‌లో జరిగే వెటరన్ పరుగు పోటీల్లో పాల్గొనేందుకు ప్రభుత్వం మరింత సహకారం అందించాలని విజయ కోరుతున్నారు.

ఇదీ చూడండి:

చలి చంపుతున్న వేళల్లో.. పర్యాటకులందరూ మన్యంలో..!

ABOUT THE AUTHOR

...view details