ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైకాపా బాధితుల శిబిరానికి.. అధికారులు - ycp badhitulu

గుంటూరు వైకాపా బాధితుల శిబిరాన్ని అధికారులు సందర్శించారు. బాధితులతో మాట్లాడిన అధికారులు వారి సమస్యలు తెలుసుకున్నారు. తిరిగి వారి సొంతూర్లకు తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. తెదేపా నేతలు అధికారుల వెంట ఉన్నారు.

గుంటూరు వైకాపా బాధితుల శిబిరాన్ని సందర్శించిన అధికారులు

By

Published : Sep 9, 2019, 10:21 PM IST

గుంటూరు వైకాపా బాధితుల శిబిరాన్ని సందర్శించిన అధికారులు

గుంటూరు వైకాపా బాధితుల పునరావాస కేంద్రాన్ని అధికారులు సందర్శించారు. గుంటూరు ఆర్డీవో భాస్కర్ రెడ్డి, తహశీల్దార్‌ మోహనరావు పోలీసులతో కలిసి శిబిరానికి వచ్చారు. అధికారుల రాకతో తెదేపా నేతలు ఆనందబాబు, అశోక్ బాబు, గద్దె రామ్మోహన్, మద్దాలి గిరిధర్ శిబిరాన్ని సందర్శించారు. ఆర్డీవో, తహశీల్దార్ బాధితులతో మాట్లాడారు. వారిని సొంత గ్రామాలకు తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. సమస్యలు తెలుసుకొని బాధితులను గ్రామాల్లో వదిలిపెడతామని భరోసా ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details