ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బెయిల్​పై 'ఎన్ఆర్ఐ' ఉద్యోగులు విడుదల.. పరామర్శించిన తెదేపా నేతలు - Guntur latest updates

గుంటూరు జిల్లా మంగళగిరి ఎన్ఆర్​ఐ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఆర్థిక అవకతకల ఆరోపణలతో అరెస్టైన ఉద్యోగులు ఉప్పలపు శ్రీనివాసరావు, వల్లూరిపల్లి నళినిమోహన్ బెయిల్​పై విడుదలయ్యారు. వారిని తెదేపా నేతలు కలిశారు.

NRI
ఎన్ఆర్ఐ

By

Published : Jul 1, 2021, 10:10 PM IST

గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ఎన్​ఆర్​ఐ అకాడమీ ఆఫ్ సైన్సెస్​లో ఆర్థిక అవకతవకలు జరిగాయంటూ.. గత నెల 23న మంగళగిరి పోలీసులు.. ఎన్​ఆర్​ఐ ఉద్యోగులు ఉప్పలపు శ్రీనివాసరావు, వల్లూరిపల్లి నళినిమోహన్​ని అరెస్టు చేశారు. కోర్టు గురువారం వారికి బెయిల్ మంజూరు చేసింది.

బెయిల్​పై వచ్చిన వారిని తెదేపా నేతలు అలపాటి రాజేంద్రప్రసాద్, తెనాలి శ్రావణ్ కుమార్​, చిట్టిబాబు జిల్లా జైల్ వద్దుకు వెళ్లి పరామర్శించారు. ఎన్​ఆర్​ఐ అకాడమీ ఆఫ్ సైన్సెస్ తరుపున వైద్యకళాశాల, బోధనాసుపత్రి నిర్వహిస్తున్నారు. అందులో నిధులను మళ్లించారంటూ సంస్థలో సభ్యునిగా ఉన్న డాక్టర్ కోండ్రగుంట బుచ్చయ్య అనే వ్యక్తి మార్చి 3వ తేదిన ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిద్దరినీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

ఇదీ చదవండి:రైతులను అరెస్టు చేసిన పోలీసులు.. కారణమేంటంటే..?

ABOUT THE AUTHOR

...view details