ఆచార్య ఎన్‌జీ రంగా విశ్వవిద్యాలయ ఉపకులపతి దామోదర్ నాయుడికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మురళీకృష్ణ అనే ఒప్పంద ఉద్యోగి ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసిన గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులు... నవభారత్ నగర్‌లో ఆయన్ని ఆదివారం అరెస్టు చేశారు.
ఎన్‌జీ రంగా వర్సిటీ వీసీ దామోదర్ నాయుడికి బెయిల్ - ng ranga university latest news
గుంటూరు ఎన్‌జీ రంగా వర్సిటీ వీసీ దామోదర్ నాయుడుకు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. అట్రాసిటీ కేసులో నిన్న దామోదర్‌నాయుడును పోలీసులు అరెస్టు చేశారు. మురళీకృష్ణ అనే ఒప్పంద ఉద్యోగి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
చిలకలూరిపేట మండలం పురుషోత్తమపట్నానికి చెందిన ఉయ్యాల మురళీకృష్ణ.... 2016 లో ఎంజీ రంగా వర్శిటీలో ఒప్పంద ఉద్యోగిగా చేరారు. 2019 ఏప్రిల్ 12న మురళీకృష్ణను ఉద్యోగం నుంచి వీసీ తొలగించారు. తిరిగి ఉద్యోగం ఇప్పించాలని అడిగేందుకు గత నెల 23న వెలగపూడి సచివాలయంలో కలిసినప్పుడు... కులం పేరుతో దామోదర్‌నాయుడు దూషించారని మురళీకృష్ణ ఆరోపించారు.ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు...సీసీ ఫుటేజీ, ఇతర ఆధారాల ద్వారా వివరాలు సేకరించారు. నిన్న దామోదర్ నాయుణ్ని అరెస్టు చేశారు. ఆయనకు హైకోర్టు ఇవాళ బెయిల్ మంజూరు చేసింది.