ఇటీవల మరణించిన గుంటూరు ఆరవ డివిజన్ కార్పొరేటర్ రమేష్ గాంధీకి నగరపాలక సంస్థ పాలక మండలి నివాళులర్పించింది. కౌన్సిల్ హాల్లో రమేష్ గాంధీ సంస్మరణ సభ నిర్వహించారు. మేయర్ మనోహరనాయుడు, ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్, కమిషనర్ అనురాధ, కార్పొరేటర్లు సంతాప సభలో పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం కాక మునుపే రమేష్ చనిపోవటం బాధాకరమని.. మేయర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి పార్టీ తరఫున అండగా ఉంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
కార్పొరేటర్ రమేశ్ గాంధీకి పాలక మండలి ఘన నివాళి - Corporator Ramesh Gandhi Condolence news
గుంటూరు నగరపాలక ఎన్నికల్లో వైకాపా కార్పొరేటర్‌గా విజయం సాధించి..ఇటీవల మృతి చెందిన రమేశ్ గాంధీకి నగర పాలక సంస్థ పాలకమండలి ఘనంగా నివాళులర్పించింది.
కార్పొరేటర్ రమేశ్ గాంధీకి ఘనంగా నివాళి