ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'గుంటూరును స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకరించాలి' - waste management in guntur district news

తడి, పొడి చెత్త వేర్వేరుగా ఇవ్వనివారికి నోటీసులు జారీ చేస్తున్నట్లు గుంటూరు నగర పాలక సంస్థ కమిషనర్ చల్లా అనురాధ తెలిపారు. జిల్లా కేంద్రాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలు సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

guntur city
గుంటూరు నగరం

By

Published : Jan 17, 2021, 3:19 PM IST

చెత్తను సమర్థంగా నిర్వహించే క్రమంలో ఇళ్లలోనే తడిచెత్తను కంపోస్టుగా మార్చుకోవాలని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా అనురాధ సూచించారు. పొడి చెత్తను డంపింగ్ యార్డుకు తరలిస్తామని చెప్పారు. గుంటూరును స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. తడి, పొడి చెత్త వేర్వేరుగా ఇవ్వనివారికి నోటీసులు జారీ చేస్తున్నట్లు తెలిపారు. ప్లాస్టిక్ వ్యర్థాల ద్వారా ఇంధన తయారీకి.. ప్లాంటు ప్రారంభించామని చెప్పారు. చెత్త ద్వారా విద్యుత్ తయారు చేసేందుకు ఈ నెలాఖరులో ప్లాంటు అందుబాటులోకి వస్తాయన్నారు. ఐటీసీ సహకారంతో చెత్త నిర్వహణ కార్యకలాపాల్ని చేపట్టినట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details