Guntur Commissioner shocked the employees: గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ చేకూరి కీర్తి.. వార్డు సచివాలయాల ఉద్యోగులకు షాక్ ఇచ్చారు. సమీక్షా సమావేశానికి ఆలస్యంగా వచ్చారని.. 47 మంది సచివాలయ ఉద్యోగులకు జరిమానా విధించారు. నగరం పరిధిలోని వార్డు సచివాలయాల్లో పని చేసే విద్యా కార్యదర్శులకు, డిజిటల్ అసిస్టెంట్లకు గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఇవాళ సమావేశం ఏర్పాటు చేశారు.
ఆలస్యంగా వచ్చారా..! అయితే, వందరూపాయల జరిమానా కట్టండి..!
Guntur Commissioner shocked the employees: సచివాలయ ఉద్యోగులు సమీక్షా సమావేశానికి ఆలస్యంగా వచ్చారని.. గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ చేకూరి కీర్తి 47 మందికి జరిమానా విధించారు. వార్డు సచివాలయాల్లో పనిచేసే విద్యా కార్యదర్శులకు, డిజిటల్ అసిస్టెంట్లకు ఆమె గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నేడు సమావేశం ఏర్పాటు చేశారు. 47 మంది ఆలస్యంగా రాగా వారందరికీ జరిమానా విధించారు.
ఈ క్రమంలో కమిషనర్ చేకూరి కీర్తి నిర్వహించిన సమావేశానికి నిర్ధేశిత సమాయానికి చాలా మంది ఉద్యోగులు రాలేదు. దీంతో ఆగ్రహించిన కమిషనర్ చేకూరి కీర్తి.. ఆలస్యంగా వచ్చిన ఉద్యోగులందరికీ జరిమానా విధించాలని అధికారులను ఆదేశించారు. మొత్తం 47 మంది ఆలస్యంగా రాగా, వారందరికీ రూ. 100 చొప్పున జరిమానా విధించారు. మొత్తం 47 మంది నుంచి వసూలు చేసిన 4,700 రూపాయలను కార్పొరేషన్ ఖాతాలో జమ చేశారు. సమీక్షా సమావేశానికి ఆలస్యంగా వచ్చిన వారికి జరిమానా విధించడంపై ఉద్యోగులు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు. అధికారులు ఆలస్యంగా వచ్చినప్పుడు ఉద్యోగులు కూడా చాలా సార్లు వేచి ఉన్న సందర్భాలు అనేకం ఉన్నాయని వారు గుర్తు చేస్తుకున్నారు.
ఇవీ చదవండి