ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సచివాలయ సిబ్బంది వేడుకలపై మున్సిపల్ కమిషనర్ ఆగ్రహం - నిబంధనలకు విరుద్ధంగా తాడేపల్లిలో వేడుకలు జరుపుకున్న సచివాలయ ఉద్యోగులు

నిబంధనలకు విరుద్ధంగా జరిగిన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న సచివాలయ సిబ్బందికి.. గుంటూరు పురపాలక సంఘం కమిషనర్ షోకాజ్​ నోటీసులు ఇచ్చారు. తాడేపల్లి అతిథి గృహంలో ఈ పార్టీ జరగ్గా.. కొవిడ్ నిబంధనలు పాటించలేదని 25 మందికి రూ. 1000 చొప్పున, అనుమతి లేకుండా గెస్ట్​హౌస్ వినియోగించినందుకు మరో రూ. 3000 జరిమానా విధించారు.

guntur municipal commissioner fired on sachivalayam staff, municipal commissioner fine to sachivalayam employees
సచివాలయ సిబ్బందిపై గుంటూరు మున్సిపల్ కమిషనర్ ఆగ్రహం, సచివాలయ ఉద్యోగులకు జరిమానా విధించిన గుంటూరు మున్సిపల్ కమిషనర్

By

Published : Mar 27, 2021, 9:28 PM IST

గుంటూరు జిల్లా తాడేపల్లిలోని అతిథి గృహంలో.. కొవిడ్ నిబంధనలు ఉల్లఘించి పుట్టినరోజు వేడుకలు చేసుకున్న సచివాలయ సిబ్బందిపై పురపాలక సంఘం కమిషనర్ కొరడా ఝుళిపించారు. ఎలాంటి అనుమతి లేకుండా అతిథి గృహం వినియోగించినందుకు సిబ్బందికి షోకాజ్​ నోటీసులు జారీచేశారు. ఒక్కొక్కరికీ రూ. 1000 చొప్పున 25 మందికి జరిమానా విధించారు. అనుమతి లేకుండా మున్సిపల్ గెస్ట్ హౌస్ వినియోగించినందుకు మరో రూ. 3000 అపరాధ రుసుము కట్టాలని ఆదేశించారు.

ఓ మహిళా ఉద్యోగిని పుట్టినరోజు వేడుకలను సీతానగరం మున్సిపల్ అతిథి గృహంలో వైభవంగా నిర్వహించారు. భౌతిక దూరం, మాస్కులు లేకుండా సంబరాలు చేసుకున్న విషయాన్ని కమిషనర్ రవిచంద్రారెడ్డి మీడియా ద్వారా తెలుసుకున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details