వార్డు సచివాలయాల్లో ప్రజలు అందించే వినతులు, ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ అనురాధ ఉద్యోగులకు సూచించారు. గుంటూరు నగరంలోని 69, 70, 71 వార్డు సచివాలయాలను కమిషనర్ ఆకస్మికంగా పరిశీలించారు. సచివాలయంలో సెక్రటరీలు, వాలంటీర్ల హాజరుపట్టికలను తనిఖీ చేశారు. వాలంటీర్లు ముందస్తు సమాచారం ఇవ్వకుండా విధులకు హాజరుకాకపోతే వారి వివరాలను అధికారులకు తెలియజేయాలని సూచించారు. బియ్యం కార్డుల పంపిణీని త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. శ్రీనివాసరావుపేట పరిధిలో కరోనా పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతుండటంతో... ఏఎన్‌ఎంలు, వాలంటీర్లు, ఆశావర్కర్లు ఇంటింటి సర్వే నిర్వహించాలన్నారు. దీర్ఘకాలిక వ్యాధులున్న వారిని గుర్తించి పల్స్, ఆక్సిమీటర్లతో ఆక్సిజన్ స్థాయిని పరిశీలించాలన్నారు. ఏమైనా తేడాలను గుర్తిస్తే వైద్యాధికారులకు తెలియజేయాలని సూచించారు.
వార్డు సచివాలయాల్లో గుంటూరు మున్సిపల్ కమిషనర్ ఆకస్మిక తనీఖీలు - గుంటూరు మున్సిపల్ కమిషనర్ అనురాధ
వార్డు సచివాలయాల్లో ప్రజలు అందించే వినతులు, ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ అనురాధ ఉద్యోగులకు సూచించారు. గుంటూరు నగరంలోని 69, 70, 71 వార్డు సచివాలయాలను కమిషనర్ మంగళవారం ఆకస్మికంగా పరిశీలించారు.
వార్డు సచివాలయాల్లో ఆకస్మిక తనీఖీలు చేపట్టిన గుంటూరు మున్సిపల్ కమిషనర్ అనురాధ