గుంటూరులో దక్షిణ మహంకాళి ఆలయం తొలగింపు యత్నం ఉద్రిక్తతకు దారి తీయడంతో అధికారులు కొంత వెనక్కి తగ్గారు. నగరపాలక సంస్థ కమిషనర్ అనురాధ ఆదేశాలతో అధికారులు చర్చలు ప్రారంభించారు. ఆందోళన చేస్తున్న వారితో మాట్లాడారు. ఆలయం తొలగింపు ప్రయత్నాలపై కమిషనర్ అనురాధ వివరణ ఇచ్చారు. కంకరగుంట బ్రిడ్జి నుంచి గుజ్జనగుండ్ల వరకు రహదారిని 160 అడుగుల మేర విస్తరిస్తున్నట్లు ఆమె తెలిపారు. విస్తరణకు అడ్డుగా ఉన్న అన్ని ప్రార్థనా మందిరాలకు ఇప్పటికే నోటీసులు ఇచ్చామన్నారు.
ఆలయ కమిటీలతో చర్చించిన తర్వాతే తొలగింపు: కమిషనర్ - ఆలయాల తొలగింపుపై గుంటూరు నగరపాలక కమిషనర్ అనురాధ
గుంటూరులోని దక్షిణ మహంకాళి ఆలయం తొలగింపు యత్నం ఉద్రిక్తతతో అధికారులు చర్యలు ప్రారంభించారు. ఆందోళన చేస్తున్న వారితో అధికారులు చర్చలు చేపట్టారు. కంకరగుంట బ్రిడ్జి నుంచి గుజ్జనగుండ్ల వరకు రహదారిని 160 అడుగుల మేర విస్తరిస్తున్నట్లు గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ అనురాధ తెలిపారు. విస్తరణకు అడ్డుగా ఉన్న అన్ని ప్రార్థనా మందిరాలకు నోటీసులు ఇచ్చామన్నారు. సంబంధిత కమిటీలతో చర్చించిన తర్వాతే తొలగింపు ఉంటుందని కమిషనర్ స్పష్టం చేశారు.
Guntur municipal commissioner anuradha
అయితే సంబంధిత కమిటీలతో చర్చించిన తర్వాతే తొలగింపు ఉంటుందని కమిషనర్ స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి అపోహలు వద్దన్నారు. మందిరాల తొలగింపు ప్రక్రియ కమిటీల ఆధ్వర్యంలోనే జరుగుతుందని స్పష్టం చేశారు. వేరే ప్రాంతంలో ఆలయాల పునర్ నిర్మాణం కోసం స్థలాలు కేటాయిస్తామన్నారు.
సంబంధిత కథనం :కాళిమాత ఆలయం తొలగింపునకు యత్నం..పరిస్థితి ఉద్రిక్తం