ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సోమవారం నుంచి మిర్చి యార్డు పుఃన ప్రారంభం - గుంటూరు మిర్చి యార్డు పుఃన ప్రారంభం

సోమవారం నుంచి గుంటూరు మిర్చి యార్డు తిరిగి ప్రారంభమవుతోంది. లాక్​డౌన్ కారణంగా రెండు నెలలుగా మూతపడగా...ప్రభుత్వం ఉన్నత స్థాయిలో చర్చించి ఎట్టకేలకు నిర్ణయం తీసుకుంది.

గుంటూరు మిర్చి యార్డు పుఃన ప్రారంభం
గుంటూరు మిర్చి యార్డు పుఃన ప్రారంభం

By

Published : May 24, 2020, 11:28 PM IST

గుంటూరు మిర్చి యార్డు సోమవారం నుంచి తిరిగి ప్రారంభం కానుంది. లాక్​డౌన్ కారణంగా రెండు నెలలుగా యార్డులో క్రయవిక్రయాలు నిలిచిపోయాయి. సుమారు 3 వేల కోట్ల రూపాయల లావాదేవీలు నిలిచిపోవడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఉన్నతస్థాయిలో చర్చించి ఎట్టకేలకు నిర్ణయం తీసుకుంది.

ఆదివారం వ్యాపారులు, శీతల గోదాముల యజమానులు, హమాలీలతో మరోసారి సమీక్షించారు. కరోనా సోకకుండా ఉండేందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటూ, పరిమిత సంఖ్యలో సంచరిస్తూ ముందుకు సాగాలని నిర్ణయించారు. రైతులు సోమవారం నుంచి యధావిధిగా క్రయవిక్రయాలు చేసుకోవచ్చని యార్డు ఛైర్మన్ ఏసురత్నం తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details