వరదలతో నష్టపోయిన పంటలపై అంచనాలను రూపొందించి, రైతులను ఆదుకోవాలని గుంటూరు జిల్లా కలెక్టర్‌ను.. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కోరారు. నగరంలో యూజీడీ పనులను పున:ప్రారంభించాలని, అందుకు సంబంధించిన పనులపై కలెక్టర్‌తో చర్చించారు. కరోనా నివారణకు కేటాయించిన నిధుల గురించి ఆరా తీశారు. ప్రస్తుతం వెంటిలేటర్ల అవసరం లేనందున... మిగిలిన నిధులను వేరే వాటికి కేటాయించామని కలెక్టర్ అన్నారు.
'పంటనష్టంపై అంచనాలు రూపొందించి పరిహారం అందించాలి' - గుంటూరు నేటి వార్తలు
వరదల వల్ల నష్టపోయిన పంటలపై అంచనాలు రూపొందించాలని గుంటూరు జిల్లా పాలనాధికారిని స్థానిక ఎంపీ కోరారు. కరోనా నివారణకు కేటాయించిన నిధులపై ఆరా తీశారు.

'పంటనష్టంపై అంచనాలు రూపొందించి పరిహారం అందించాలి'