ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఎన్టీఆర్​కి భారతరత్న ఇవ్వాలని కోరడం హాస్యాస్పదంగా ఉంది' - సీఎంగా జగన్​

సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టి రెండు ఏళ్లు పూర్తైన సందర్భంగా గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్, మేయర్ కావాటి మనోహర్ నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. పేద, బడుగు, బలహీన వర్గాల వారి అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేస్తున్న వ్యక్తి సీఎం జగన్​ అని కొనియాడారు.

guntur
గుంటూరు ఎమ్మెల్యే మీడియా సమావేశం

By

Published : May 30, 2021, 9:11 PM IST

పేద, బడుగు, బలహీన వర్గాల వారి అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేస్తున్న వ్యక్తి సీఎం జగన్ అని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ అన్నారు. సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టి రెండు ఏళ్లు పూర్తైన సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లులా సీఎం జగన్ పాలన సాగిస్తున్నారని అభినందించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 94 శాతం పూర్తి చేశారన్నారు. ప్రతీ సంక్షేమ పథకం ప్రజలకు అందేలా చర్యలు తీసుకున్నారన్నారు.

తెదేపా నేతలు ఎన్టీఆర్​కి భారతరత్న ఇవ్వాలని కోరడం హాస్యాస్పదంగా ఉందని మేయర్ కావాటి మనోహర్ నాయుడు అన్నారు. 14 సంవత్సరాలు అధికారంలో ఉన్న తెదేపా నేతలు భారతరత్నగురించి అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదన్నారు. గత ప్రభుత్వం కంటే తమ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో నిలిచిపోయిందన్నారు.

ఇదీ చూడండి.CM Jagan: 'మేనిఫెస్టో హామీల్లో 94శాతం పూర్తి చేశాం'

ABOUT THE AUTHOR

...view details