గుంటూరు మిర్చియార్డు మరోసారి మూతపడనుంది. కరోనా వ్యాప్తి కారణంగా ఈ నెల 19వరకు యార్డును మూసివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. కరోనా కారణంగా సీజన్లో తొలి 2 నెలల పాటు లావాదేవీలు నిలిచిపోయాయి. 60 రోజుల తర్వాత మే 25న తెరిచి క్రయ విక్రయాలు ప్రారంభం కాగా... కేసుల పెరుగుదలతో మళ్లీ మూసేశారు.
కరోనా ఎఫెక్ట్: ఈనెల 19 వరకు గుంటూరు మిర్చి యార్డు మూసివేత - corona virus
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గుంటూరు మిర్చి యార్డును ఈనెల 19 వరకు మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. యార్డుకు ఎవరూ మిర్చి బస్తాలను తీసుకురావొద్దని కోరారు.
guntur mirchiyard
ఇప్పటికే మిర్చి యార్డులో పనిచేసే హమాలీలు, గుమస్తాలు, కమిషన్ ఏజెంట్లు కరోనా బారిన పడ్డారు. అయినా.. గత వారం రోజులుగా లావాదేవీలు నిర్వహించినప్పటికీ సగటున రోజుకు 10 వేల బస్తాలకు క్రయవిక్రయాలు మించడం లేదు. ఈ నేపథ్యంలో యార్డును మూసివేస్తున్నట్టు తెలిపిన అధికారులు.. ఎవరూ మిర్చిని తీసుకురావద్దని కోరారు.