గుంటూరు మిర్చియార్డులో కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి. మిర్చియార్డులో పనిచేసే వారిలో దాదాపు 20మందికి కరోనా సోకిన కారణంగా.. అధికారులు 10రోజుల పాటు మూసివేశారు. యార్డులో శుద్ధి కార్యక్రమాలు చేపట్టిన తర్వాత తిరిగి లావాదేవీలు మొదలుపెట్టారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి లోపలకు రావాలని స్పష్టం చేశారు. అలాగే యార్డుకు సంబంధించిన గుర్తింపు కార్డులు ఉన్నవారినే లోపలకు అనుమతిస్తామని అధికారులు తెలిపారు. శీతల గిడ్డంగుల నుంచే కార్యకలాపాలు నిర్వహించేలా అనుమతి ఇచ్చారు. అలాగే ఎక్కువమంది ఒక చోట గుమిగూడకుండా ఆదేశాలు జారీ చేశారు.
గుంటూరు మిర్చి యార్డులో కార్యకలాపాలు పునఃప్రారంభం
గుంటూరు మిర్చియార్డులో కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి. యార్డులో శుద్ధి కార్యక్రమాలు చేపట్టిన తర్వాత తిరిగి లావాదేవీలు మొదలుపెట్టారు.
పునఃప్రారంభమైన గుంటూరు మిర్చి యార్డు