ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రికార్డు సృష్టించిన గుంటూరు మిర్చి యార్డు - గుంటూరు మిర్చి

ఈ-నామ్‌ ద్వారా 10 వేల కోట్ల వ్యాపారం సాధించి.. గుంటూరు మిర్చి యార్డు రికార్డు సృష్టించింది. దేశంలోనే ఈ ఘనత సాధించిన మొదటి మార్కెట్​ కమిటీగా నిలిచింది.

Guntur Mirchiyard has set a record of 10 billion crores through e-nam marketing in india
రికార్డు సృష్టించిన గుంటూరు మిర్చియార్డు

By

Published : Feb 19, 2020, 8:13 AM IST

గుంటూరు మిర్చియార్డులో ఈ-నామ్‌ ద్వారా మిర్చి క్రయవిక్రయాల వ్యాపారం రూ.10 వేల కోట్లు దాటింది. దేశంలోనే ఈ ఘనత సాధించిన మొదటి మార్కెట్‌ కమిటీగా రికార్డు సృష్టించింది. ఇందుకు సంబంధించిన గణాంకాలు మంగళవారం ఆన్‌లైన్‌లో నమోదయ్యాయి. దేశంలో 544, రాష్ట్రంలో 22 మార్కెట్‌ కమిటీల్లో రెండేళ్ల కిందట కేంద్రం ఈ-నామ్‌ను ప్రవేశపెట్టింది. ఆసియాలోనే పేరెన్నికగన్న గుంటూరు మిర్చియార్డులోనూ ఈ విధానాన్ని అమలు చేశారు. నాటి నుంచి నేటి వరకు జరిగిన క్రయవిక్రయాలు రూ.10 వేల కోట్ల వ్యాపార విలువ దాటిందని కార్యదర్శి వెంకటేశ్వరరెడ్డి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details