కరోనా దెబ్బకు ఎవరూ బయటకు రాని పరిస్థితుల్లో.. గుంటూరు మిర్చి రైతులు ఆందోళన చెందుతున్నారు. చేతికొచ్చిన పంట కోయకుంటే నాశనం.. కోద్దామంటే కూలీలు లేరు. చేసేదేమీ లేక రైతులే రోజుకు కొన్ని మిరపకాయల చొప్పున కోస్తూ విపరీతంగా ఇబ్బంది పడుతున్నారు. అలా.. రోజుల తరబడి కోసినా ఆ పంటను మార్కెట్లకు తరలించలేని పరిస్థితి. కనీసం కోల్డ్ స్టోరేజీకైనా తీసుకెళ్లలేని దుస్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటను తరలించే గోతాం సంచుల ధరనూ పెంచేశారని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
లాక్ డౌన్ ఎఫెక్ట్: చేతికొచ్చిన పంట ఇంటికొచ్చే మార్గం లేదు - guntur farmers problems
కరోనా ప్రభావం వల్ల మిర్చి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పంట చేతికొచ్చే సమయానికి కోత కొయ్యలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గంలో మిర్చి బాగా పండినా... కూలీలు దొరకక పంట కోయడం సమస్యగా మారింది.
మిర్చి పంటకు కూలీలు దొరక్క ఇబ్బందులు పడుతున్న రైతులు