గుంటూరులో ప్రజల సౌలభ్యం కోసం వివిధ ప్రాంతాలలో బస్ షెల్టర్లు ఏర్పాటు చేస్తామని.. ఆక్రమణలు జరిగిన బస్సు షెల్టర్లలో వాటిని తొలగిస్తామని నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు అన్నారు. నగర పాలక సంస్థ కౌన్సిల్ కార్యాలయంలో ఆర్టీసీ అధికారులతో సమావేశమై సమస్యలపై చర్చించారు. ప్రజల రద్దీకి అనుగుణంగా నగరంలోని పలు ప్రాంతాలలో "ఈ" బస్ బేల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని.. ఆర్టీసీ అధికారులు గుర్తించిన ప్రాంతాల వివరాలు ఇస్తే కమిషనర్‌తో చర్చించి చర్యలు తీసుకుంటామన్నారు. నగరం నుంచి బయట ప్రాంతాలకు వెళ్లే బస్సులు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా వాటికోసం నిర్దేశించిన స్థలాల్లో యాణికులను ఎక్కించుకోవాలన్నారు.
ఆర్టీసీ అధికారులతో గుంటూరు నగర మేయర్ సమావేశం - గుంటూరులో బస్ బేల నిర్మాణ వార్తలు
గుంటూరు ఆర్టీసీ అధికారులతో నగర మేయర్ మనోహర్ నాయుడు సమావేశమయ్యారు. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వివిధ ప్రాంతాల్లో బస్ షెల్టర్ల ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఆర్టీసీ అధికారులు నిర్మాణాల కోసం గుర్తించిన ప్రాంతాల వివరాలు ఇవ్వాలని తెలిపారు.
గుంటూరు ఆర్టీసీ అధికారులతో నగర మేయర్ సమావేశం