గుంటూరు నగరంలోని మురుగు కాల్వల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించే పనులను వేగవంతం చేయాలని అధికారులను మేయర్ కావటి మనోహరనాయుడు ఆదేశించారు. సంపత్ నగర్‌లోని డ్రెయిన్లలో సిల్ట్ తొలగించే పనులను ఆయన పరిశీలించారు. ప్రజారోగ్య అధికారులు, ఇంజినీరింగ్ అధికారులు సమన్వయంతో పని చేయాలని మేయర్ సూచించారు. అవసరమైన ప్రాంతాల్లో అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని, మురుగు కాల్వల శుద్ధీకరణ పనుల్లో నిర్లక్ష్యం తగదని హెచ్చరించారు.
చెత్త తొలగింపు పనులు వేగవంతం చేయాలి: మనోహరనాయుడు
గుంటూరులోని సంపత్‌నగర్ డ్రెయిన్లలో మురుగును తొలగించే పనులను నగర మేయర్ మనోహరనాయుడు పరిశీలించారు. మురుగు కాల్వల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించాలని, పనుల్లో నిర్లక్ష్యం తగదని అధికారులకు సూచించారు.
గుంటూరు నగర మేయర్ మనోహరనాయుడు