ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గ్రామవాలంటీర్​ను పరామర్శించిన మార్కెట్ యార్డు ఛైర్మన్ - గ్రామ వాలంటీర్ ఆత్మహత్యాయత్నం

ఉద్యోగం నుంచి తొలగించే ప్రయత్నం చేస్తున్నారంటూ.. ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వాలంటీర్ మహంకాళి అంకేశ్వరిని గుంటూరు మార్కెట్ యార్డు ఛైర్మన్ చంద్రగిరి ఏసురత్నం పరామర్శించారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు.

గ్రామ వాలంటీర్​ను పరామర్శించిన గుంటూరు మార్కెట్ యార్డు ఛైర్మన్
గ్రామ వాలంటీర్​ను పరామర్శించిన గుంటూరు మార్కెట్ యార్డు ఛైర్మన్

By

Published : Nov 27, 2020, 8:55 PM IST

ఆత్మహత్యాయత్నానికి పాల్పడి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గ్రామ వాలంటీర్ మహంకాళి అంకేశ్వరిని... గుంటూరు మార్కెట్ యార్డు ఛైర్మన్ చంద్రగిరి ఏసురత్నం పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. నిజాయతీగా పనిచేస్తున్నప్పటికీ తనను ఉద్యోగం నుంచి తొలగించే ప్రయత్నం చేస్తున్నారంటూ.. సీఎం జగన్​కు లేఖ రాసి దివ్యాంగురాలైన వాలంటీర్ మహంకాళి అంకేశ్వరి మూడు రోజుల కిందట ఆత్మహత్యకు యత్నించిన విషయం తెలిసిందే.

ABOUT THE AUTHOR

...view details