ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ప్రభావం దుకాణాలు, మాల్స్, చిరు వ్యాపారాలపై తీవ్రంగా పడుతోంది. కొవిడ్ 19 వ్యాప్తి దృష్ట్యా గుంటూరు జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. నేటి నుంచి నగరంలోని దుకాణాలు, రహదారుల వెంబడి ఉన్న చిరు వ్యాపారుల దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో నిన్న సాయంత్రం ప్రజలందరూ దుకాణాల ముందు బారులు తీరారు. మాల్స్ లోపలికి వచ్చే వినియోగదారులకు స్క్రీనింగ్ నిర్వహించి, శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేయించిన తరువాతే లోపలికి అనుమతిస్తున్నారు. మహిళలు, పిల్లలు, వృద్ధులు అనే తేడా లేకుండా గంటల తరబడి క్యూలైన్లలో నిరీక్షించారు.
మాల్స్ ముందు బారులు తీరిన జనం - కరోనా వ్యాప్తితో గుంటూరులో మాల్స్ మూసివేత
కరోనా వైరస్ వ్యాప్తిపై గుంటూరు జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. నేటి నుంచి షాపింగ్‌మాల్స్, దుకాణాలు, చిరువ్యాపారుల దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.
![మాల్స్ ముందు బారులు తీరిన జనం malls close from today on words due to corona spread in guntur](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6474628-927-6474628-1584678344357.jpg)
మాల్స్ ముందు బారులు తీరిన జనం